గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 23:16:28

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అర్చకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ కమిషనర్‌ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ నివారణ, లోక కల్యాణార్థం కోసం అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అలాగే ప్రముఖ పుణ్యతీర్థం త్రీవేణి సంగమంలో  గోదావరి తీర పూరోహితులు అస్థికల పూజలు చేశారు. లాక్‌ డౌన్‌ కారణంగా పూజలు బంద్‌ కాగా ప్రభుత్వ సడలింపులతో తిరిగి పూజలు ప్రారంభించారు.logo