శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:44

స్థానికులకు ఉద్యోగాలివ్వండి

స్థానికులకు ఉద్యోగాలివ్వండి

  • ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవోకు ఎంపీ వెంకటేశ్‌ వినతి

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని కోరారు. మంగళవారం ఢిల్లీలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ కార్యాలయంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నిర్లీప్‌సింగ్‌ రాయ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. స్థానికులకు అవకాశం ఇవ్వకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. ఇటీవల ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సమీక్షలో సైతం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కానీ ఆ దిశగా అధికారులు ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతే ఇతర ప్రాంతాల వారికి కల్పించాలని కోరారు.