గురువారం 04 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:49:57

అమ్మే ప్రపంచం

అమ్మే ప్రపంచం

  • మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ కవిత 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ కవిత ఆదివారం ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ గొప్పతనాన్ని వివరించారు. ‘ప్రపంచానికి ఆమె మా అమ్మ. కానీ నాకు అమ్మే ప్రపంచం’ అని మాజీ ఎంపీ కవిత ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు. ‘నా జీవితంలో ఇద్దరు మహిళలు అత్యంత గౌరవనీయులు. ఒకరు జన్మనిచ్చిన అమ్మ, మరొకరు ఆ జన్మకు విలువనిచ్చిన పెద్దమ్మ. జీవితంలో వారే అన్నీ ఇచ్చారు’ అంటూ ఎంపీ సంతోష్‌కుమార్‌ అమ్మ, పెద్దమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌చేశారు.

లాక్‌డౌన్‌లో అమ్మకు విశ్రాంతినిద్దాం: డీజీపీ 

లాక్‌డౌన్‌ సమయాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తికి కొంత విశ్రాంతినిచ్చేందుకు ప్రయత్నించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. ‘ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆదివారం ట్వీట్‌ చేశారు.


logo