గురువారం 09 జూలై 2020
Telangana - Apr 03, 2020 , 00:30:24

స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష

స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష

-కరోనాపై ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. కరోనా నుంచి రక్షించేది స్వీయ నిర్బంధమేనని, అదే రామబాణం వంటిదని శ్రీరామనవమి సందర్భం గా గురువారం ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలను విధిగా పాటించాలని కోరారు. పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తూ అన్నార్తులకు రక్షణగా నిలుస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. కరీంనగర్‌లో వికలాంగులకు, యాచకులకు భోజనాలు అందిస్తున్న పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌ను సంతోష్‌కుమార్‌ అభినందించారు.


logo