సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 02:13:42

వధూవరులకు ఆన్‌లైన్‌ ఆశీర్వాదం!

వధూవరులకు ఆన్‌లైన్‌ ఆశీర్వాదం!

  • వీడియోకాల్‌లో ఎంపీ సంతోష్‌ శుభాకాంక్షలు
  • కరోనా నేపథ్యంలో వినూత్న విషెస్‌ 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ వివాహానికి వెళ్లకుండా వధూవరులకు వీడియోకాల్‌ చేసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించారు. ఎంపీ సంతోష్‌ వ్యక్తిగత గన్‌మ్యాన్‌ నరేందర్‌గౌడ్‌ వివాహం శుక్రవారం భువనగిరిలో ఉమారాణితో జరిగింది. పెండ్లికి ఎంపీ సంతోష్‌కుమార్‌ కుటుంబంతో హాజరుకావాల్సి ఉన్నది. వివాహాది శుభకార్యాలకు అధికసంఖ్యలో హాజరుకావొద్దన్న సీఎం కేసీఆర్‌ సూచనతో వీడియోకాల్‌ ద్వారా నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసమ్మర్దం వల్లే వైరస్‌ వ్యాపిస్తున్నదని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని ఆయన పిలుపునిచ్చారు. logo