బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 12:53:33

ప్రేర‌ణ పొందేలా ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్‌

ప్రేర‌ణ పొందేలా ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్‌

రాజ్య‌స‌భ స‌భ్యులు, టీఆర్ఎస్ నాయ‌కులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పోస్టు చేసే ఏ ట్వీట్ అయినా.. ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచించ‌జేసేలా, ఆద‌ర్శంగా తీసుకునేలా ఉంటుంది. తాజాగా ప్రేర‌ణ‌కు సంబంధించిన ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు సంతోష్ కుమార్. ధృడ నిశ్చ‌యం ఉంటే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు. మీ జీవితంలో మీరు ఏది కావాల‌నుకుంటున్నారో దాన్ని ప‌ట్టుద‌ల‌తో సాధించుకోవాలి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకు ఇది ఒక ఉద‌హ‌ర‌ణ‌, ప్రేర‌ణ‌? ఈ అమ్మాయి చిరునవ్వుల ముందు ఏది సాటిరాదు అని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.


logo