బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 14:49:49

సినారె సాహిత్య వారసత్వం వర్థిల్లాలి : ఎంపీ సంతోష్‌ కుమార్‌

సినారె సాహిత్య వారసత్వం వర్థిల్లాలి : ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్‌ : కవి, గేయ రచయిత, సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ సినారేకు ఘన నివాళి అర్పించారు. ట్విట్టర్‌ ద్వారా ఎంపీ స్పందిస్తూ... పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని.. మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని అంటూ సినారే గజల్‌ను ఉదహరించారు. పగలే వెన్నెల కురిసిన కలం ఆయన.. జగమేఊయలూగిన స్వరం ఆయన.. తెలంగాణకు అందించెను జ్ఞానపీఠ పురస్కృతి.. సినారె అంటే ఒక సమ్మోహన కవితాకృతి.. వర్థిల్లాలి సినారె సాహిత్య వారసత్వం అని పేర్కొన్నారు.   

తెలుగు సాహిత్యానికి సినారే ఎనలేని సేవలు చేశారు. సినీగేయ రచయితగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన సినారే తన విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ శ్రీ అవార్డు, పద్మ భూషణ్‌ వంటి ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. సినారె 12 జూన్‌ 2017న పరమపదించిన సంగతి తెలిసిందే.


logo