గురువారం 04 జూన్ 2020
Telangana - May 07, 2020 , 02:22:12

ప్రత్యర్థులపై ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆగ్రహం

ప్రత్యర్థులపై ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆగ్రహం

  • మూటాముల్లె సర్దుకోవాల్సిందే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుపథకాలపై ఇచ్చిన సమాధానంతో రాజకీయ ప్రత్యర్థులు మూటాముల్లె సర్దుకోవాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ అన్నారు. రైతుబంధు పథకం అమలుపై మంగళవారం మరింత స్పష్టతనిచ్చి, ప్రత్యర్థుల తప్పుడు ప్రచారానికి జవాబిచ్చారంటూ సీఎం ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్వీట్‌చేశారు. మరో ట్వీట్‌లో రైల్వేపట్టాల మధ్యలో పెరిగిన మొక్క చిత్రాన్ని సంతోష్‌ పోస్ట్‌చేశారు. ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఉన్నామనేది కాదని.. ఒక్క అవకాశమిస్తే ఎక్కడైనా పెరుగుతామని ఈ మొక్క చెప్తున్నదని పేర్కొన్నారు. 

 తెలంగాణ బత్తాయి డే బ్రోచర్‌ ఆవిష్కరణ

తెలంగాణ ప్రజలు బత్తాయిలను పెద్దఎత్తున కొనుగోలు చేయాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఈనెల 10న బత్తాయి డేను పురస్కరించుకొని బుధవారం ప్రగతిభవన్‌లో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు సీ విటమిన్‌ పుష్కలంగా ఉండే బత్తాయిలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.


logo