శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 17:16:25

వధూవరులకు ఎంపీ సంతోష్ కుమార్ ఆన్‌లైన్‌ ఆశీర్వచనం

వధూవరులకు ఎంపీ సంతోష్ కుమార్ ఆన్‌లైన్‌ ఆశీర్వచనం

హైదరాబాద్ : నూతన వధూవరులకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వీడియో కాలింగ్ ద్వారా  ఆశీస్సులను అందజేశారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరైన నరేందర్ గౌడ్ వివాహం నేడు. యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి పట్టణం లోని  వైఎస్ఆర్ గార్డెన్ లో నరేందర్ గౌడ్ - ఉమారాణిల వివాహం నేడు జరిగింది. ఈ వివాహానికి వ్యక్తిగతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలనుకున్న ఎంపీ సంతోష్...  కరోనా కారణంగా వెళ్లలేకపోయారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని, వివాహాలకు, శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటించడం వల్ల వివాహానికి హాజరుకాలేకపోయారు. 

అయినప్పటికీ వీడియో కాలింగ్ ద్వారా నూతన వధూవరులను ఎంపీ ఆశీర్వదించారు. స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వాదం ఇవ్వాలని మనస్సులో తనకున్నా కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయినట్లు తెలిపారు.  కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు వివాహానికి వెళ్లకుండా ఉండడం జరిగిందన్నారు. అదేవిధంగా  ప్రముఖులు, ప్రజలు అందరు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు ఎక్కువగా చేరే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దని కోరారు.logo