బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 01:50:47

ఎంత అద్భుత దృశ్యం

ఎంత అద్భుత దృశ్యం
  • మిడ్‌మానేర్‌ బ్యాక్‌వాటర్‌పై ఎంపీ సంతోష్‌కుమార్‌ భావోద్వేగ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేలమంది బాగుపడాలంటే కొందరైనా త్యాగంచేయాలి. వారి త్యాగానికి ఫలితంగా అద్భుతాలు కండ్లముందు సాక్షాత్కారం కావాలి. అప్పుడు వారుకూడా ఎంతో సంతోషపడతారు. అలాంటి సందర్భమే ఎంపీ సంతోష్‌కుమార్‌ జీవితంలోనూ జరిగింది. ప్రస్తుతం కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో నిండిన ప్రాంతం.. తమ బాల్యంలో మధుర జ్ఞాపకాలతో నిండిన గ్రామాలని ఎంపీ గుర్తుచేసుకున్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తంచేశారు.


ఈ సందర్భంగా బ్యాక్‌వాటర్‌తో జలకళ సంతరించుకున్న మిడ్‌మానేర్‌ ఫొటోలను పోస్టుచేస్తూ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘ఎంత అద్భుతమైన దృశ్యం. ఏ గ్రామంలోనైతే మా చిన్ననాటి మధుర జ్ఞాపకాలతో కూడిన భూములను కోల్పోయామో, ప్రస్తుతం ఆ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. మిడ్‌మానేర్‌లో బ్యాక్‌వాటర్‌ ఉప్పొంగుతున్నాయి. మేము కోల్పోయిన జ్ఞాపకాల విలువ.. మా ప్రాంతంలోని రైతులకు అద్భుత సాయంగా మారింది’ అని సంతోష్‌కుమార్‌ సంతోషం వ్యక్తంచేశారు.


logo
>>>>>>