శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:57

మీరొక ఐకాన్‌

మీరొక ఐకాన్‌

  • పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా!
  • మంత్రి కేటీఆర్‌కు ఎంపీ సంతోష్‌ స్పెషల్‌ విషెస్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్‌. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో దిగిన చిన్ననాటి ఫొటోను సంతోష్‌ పంచుకున్నారు.logo