గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 01:59:54

పీయూసీ సభ్యుడిగా సంతోష్‌కుమార్‌

పీయూసీ సభ్యుడిగా సంతోష్‌కుమార్‌

  • ఉత్తర్వులిచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పార్లమెంట్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ (పీయూసీ) సభ్యుడిగా జే సంతోష్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఉత్తర్వులు జారీచేశారు. కమిటీ చైర్మన్‌గా మీనాక్షి లేఖి నియమితులుకాగా, మరో 21 మంది సభ్యులుగా (లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు) ఉన్నారు. ఈ కమిటీ 2020-21 సంవత్సరానికి బాధ్యతలు నిర్వర్తించనున్నది.logo