గురువారం 02 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 10:36:32

హ్యాపీ బర్త్‌డే బావా

హ్యాపీ బర్త్‌డే బావా

హైదరాబాద్‌ : మంత్రి హరీశ్‌రావుకు ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిరువురు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ... హ్యాపీ బర్త్‌డే బావా అని పేర్కొన్నారు. సంతోష్‌కుమార్‌ స్పందిస్తూ... గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాల్సిందిగా హరీశ్‌ను కోరారు. పుట్టినరోజును పురస్కరించుకుని మరో మూడు మొక్కలకు జీవితాన్నిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. 

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్దఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,  చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు పూర్తి ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.


logo