గురువారం 28 జనవరి 2021
Telangana - Jan 14, 2020 ,

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చొరవ అమోఘం..

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చొరవ అమోఘం..

సూర్యపేట: పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అమోఘమని సూర్యపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన ఇవాళ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి ఫలితాలు రాబడుతోందన్నారు. చాలెంజ్ ను స్వీకరించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతున్నారనీ.. ఆయన అన్నారు. ఎంపీ.. పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చొరవ అద్భుతమైనది ఆయన అన్నారు. 


భవిష్యత్ తరాలకు చక్కటి గాలి, మంచి వాతావరణం ఉండాలి అంటే మనం చెట్లు నాటడం ముఖ్యమని ఆయన తెలిపారు. అదే క్రమంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలి అని ఎస్పీ అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు ఆయన ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పోలీసులు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.
logo