బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 23:56:00

గద్వాల టీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి ఎంపీ సంతోష్‌ భరోసా

గద్వాల టీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి ఎంపీ సంతోష్‌ భరోసా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హఠాన్మరణం చెందిన గద్వాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మాజీ కౌన్సిలర్‌ కస్తూరి గణేశ్‌ ముదిరాజ్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ సంతోష్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నేనున్నానం టూ ముందుకొచ్చారు. రెండేండ్ల కిందట బండ ప్రకా శ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, సంతోష్‌కుమార్‌ ఎంపీలుగా ప్రమాణంచేసే కార్యక్రమానికి గద్వాల నుంచి గణేశ్‌ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో రైల్లో గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఆయన కుమార్తె అంకిత.. కుటుంబం గడవడం ఇబ్బందిగా మారిందని, సాయంచేయాలని  సామాజి క మాధ్యమంలో అభ్యర్థించారు. వీడియోను చూసిన ఎంపీ సంతోష్‌కుమార్‌ స్పందించారు. గణేశ్‌ ముదిరాజ్‌ భార్య, కుమార్తెలు అంకిత, కోమల్‌ గురించి తెలుసుకున్నారు. ఆదుకుంటామని ట్విట్టర్‌ ద్వారా భరోసా ఇచ్చారు. త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు.


logo
>>>>>>