శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:43:30

దిల్‌దార్‌ సీఎం.. కేసీఆర్‌

దిల్‌దార్‌ సీఎం.. కేసీఆర్‌

  • వలస కూలీలను అక్కున చేర్చుకున్న మానవతావాది
  • ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్వీట్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను ఇక్కడి ప్రజలుగానే పరిగణించి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. దిల్‌దార్‌ ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఎంపీ సంతోష్‌కుమార్‌ కొనియాడారు. సీఎం కేసీఆర్‌ గొప్ప మానవతావాది అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా వలస కూలీలకు వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని, నిర్ణీత దూరం పాటించాలని కోరారు.logo