Telangana
- Jan 09, 2021 , 12:39:59
ఎమ్మెల్సీ కవితకు ‘వృక్షవేదం’ పుస్తకం అందజేత

హైదరాబాద్: రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు, చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వృక్షవేదం పుస్తకం చాలా అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవులు, ప్రకృతి అందాలను ఎంతో రమణీయంగా చూపించారని తెలిపారు. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని, ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యాన్ని తీసుకువస్తుందని తెలిపారు. వృక్ష వేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ సభ్యులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
తాజావార్తలు
- రైతు సంఘాలతో 11వ సారి కేంద్రం చర్చలు
- మనో వేదనతోనే రాజీనామా: బెంగాల్ మంత్రి
- భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- లాకర్లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు
- ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు
- ఇండియా కొత్త రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- నో టైమ్ టు డై.. మళ్లీ వాయిదా
- చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం
- రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు
- మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్‌ప్లస్ సెక్యూరిటీ
MOST READ
TRENDING