ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:00

హరిత స్ఫూర్తికి కదిలారు

హరిత స్ఫూర్తికి కదిలారు

  • మొక్కలునాటిన ఎంపీ సంతోష్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజాప్రతినిధులు హరితస్ఫూర్తిని చాటారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్‌, భేతి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు, మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని మాజీ ఎంపీ కవిత ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. మరోవైపు, యూసఫ్‌గూడలోని నిమ్స్‌మేలో డైరెక్టర్‌ జనరల్‌ గ్లోరి స్వరూప, ఉద్యోగులు దాదాపు 300 మొక్కలు నాటారు. రెడ్‌హిల్స్‌లోని తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సీఈవో ఖ్యాతినారావణే, డిప్యూటీ సీఈవో టీ సుజాత మొక్కలు నాటారు. దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమి పర్యావరణ అంశాలపై శుక్రవారం పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించింది. హరితహారంలో భాగంగా తెలంగాణ పోలీస్‌ అకాడమిలో లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు డైరెక్టర్‌ వీకే సింగ్‌ శుక్రవారం ప్రకటించారు. 


logo