మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 02:00:38

నీలాంటి సోదరి దొరకడం అదృష్టం

నీలాంటి సోదరి దొరకడం అదృష్టం
  • కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ఎంపీ కవితకు ఎంపీ జే సంతోష్‌కుమార్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆదరణీయ, దయగల నీలాంటి సోదరిని కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ట్విట్‌ చేశారు. నీవు చూపే ప్రేమానురాగాలు ఎప్పటికీ మరిచిపోలేనని, ఆ భగవంతుడి ఆశీర్వాదం సమృద్ధిగా లభించాలని ఆకాంక్షించారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతోపాటు ప్రజాసేవలో చిరకాలం ఉండేలా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.  logo
>>>>>>