మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 02:08:12

వికారాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌

వికారాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌
  • ఎంపీ రంజిత్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) మొదటిదశను లింగంప ల్లి నుంచి వికారాబాద్‌ వరకు పొడిగించాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం లోక్‌సభలో రైల్వేపద్దులపై చర్చ లో ఆయన మాట్లాడుతూ..  రాష్ర్టానికి కొత్తగా రైల్వేలైన్ల కోసం నిధులు రావడంలేదన్నారు. రాష్ట్రంలోనే చివరిదైన చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నవాంగిస్టేషన్‌లో ఉదయం 6.30 గంటలకు ఒకేఒక్క రైలు ఆగుతుందని, ఆ తర్వాత వచ్చేవేవీ ఆగడంలేదనిచెప్పారు. గరీబ్థ్‌,్ర పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లను తాండూరులో నిలపాలని, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను వికారాబాద్‌లో ఆపాలని కోరారు. 


పీఎంజేవీకే క్లాస్‌రూంలు 

పీఎంజేవీకే కింద తెలంగాణకు 103 అదనపు తరగతి గదులు, 50 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 కామన్‌సర్వీస్‌ సెంటర్లు, 340 కంప్యూటర్లు ఇచ్చినట్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి తెలిపారు. పీఎంజేవీకే పథకంపై చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.


logo
>>>>>>