సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:47:05

కేటీఆర్‌కు ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రగతి నివేదిక

కేటీఆర్‌కు ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రగతి నివేదిక

వికారాబాద్‌ : చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషిచేశానని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఏడాది కాలంలో పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు, నియోజకవర్గ రైల్వే సమస్యలు, కందిబోర్డు కోసం రైతుల పక్షాన ప్రస్తావించిన అంశాలు, ఫార్మా సిటీ ఏర్పాటుకు చేసిన ప్రయత్నం తదితర అంశాలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు వివరించారు. భవిష్యత్తు ప్రగతి ప్రణాళికపై రూపొందించిన నివేదికను అందజేశారు. అభివృద్ధికి సహకరిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారని రంజిత్‌రెడ్డి వెల్లడించారు. ‘అభివృద్ధి.. అందుబాటు’ అన్న నినాదంతో సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు.logo