శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 17:43:09

మరోమారు ఉదారతను చాటుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

మరోమారు ఉదారతను చాటుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

రంగారెడ్డి : చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న యువకుడిని కారులో నుంచి దించకుండా అక్కడే ఉంచి అతడి సమస్యను తెలుసుకున్నారు. షాబాద్‌ మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన రాఘవేందర్‌ అనే యువకుడికి ఎంపీ రంజిత్‌రెడ్డి తనదైన శైలితో సహాయ సహకారాలు అందించారు. నాకు సహాయం చేయండి సార్‌.. అని మంగళవారం యువకుడు ఎంపీ నివాసానికి వచ్చాడు. రాఘవేందర్‌ స్థితిగతులపై నేరుగా ఎంపీ ప్రత్యేకంగా యువకుడి కారు వద్దకు వచ్చి అడిగి తెలుసుకున్నారు. 

తమ ప్రాంతంలోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన రెండు కాళ్లు విరిగిపోయాయని యువకుడు తెలిపాడు. అందుకు సంబంధిత కంపెనీ యాజమాన్యం 50 శాతం జీతాన్ని ఇస్తూ వైద్య ఖర్చులు భరిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తనను ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపాడు. కుటుంబపోషణ భారంగా మారింది సార్‌ అని ఎంపీకి తన గోడు చెప్పుకున్నాడు.

 విషయాన్ని తెలుసుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంత దూరం ఎందుకు వచ్చావు..ఒక్క ఫోన్‌ చేస్తే మీ పని అయిపోయేదని చెప్పారు. సంబంధిత కంపెనీ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ రాఘవేందర్‌కు రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్‌, హామీలను వెంటనే ఇవ్వాల్సిందిగా యాజమాన్యాన్ని ఆదేశించారు. ఎంపీ ఉదారంగా స్పందిచడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.