గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 14:49:22

లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను అందజేసిన ఎంపీ..

లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను అందజేసిన ఎంపీ..

మహబూబాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎం రిలీఫ్‌ ఫండ్‌) చెక్కులను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు మాలోత్‌ కవిత లబ్దిదారులకు అందజేశారు. ఇవాళ ఉదయం జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆమె లబ్దిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల పాలిట పెన్నిది అని తెలిపారు. వ్యాధి బారిన పడి, చికిత్సకు నోచుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు.. సీఎం కేసీఆర్‌, ఎంపీ మాలోత్‌ కవితకు ధన్యవాదాలు తెలిపారు. 


logo