గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 01:58:16

చేనేతకు మరిన్ని నిధులివ్వండి

చేనేతకు మరిన్ని నిధులివ్వండి

  • లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో చేనేత కార్మికులకు భరోసా లేదని, వారిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం చొరువ చూపాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేనేత కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. అనేక ప్రతికూల పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న చేనేత కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. చేనేత పరిశ్రమకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి జీవితాల్లో వెలు గులు నింపాలని పేర్కొన్నారు. చేనేతరంగానికి కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడంలోనూ కేంద్రం చొరువ చూపడంలేదని అన్నారు. దీనిపై కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ సమాధానమిస్తూ.. చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం పలు రకాల పథకాలను అమలుచేస్తున్నదన్నారు. ముద్ర యోజన కింద బ్యాంకుల ద్వారా వారికి రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు. 

ట్రిపుల్‌ఐటీలో పెరుగనున్న విద్యార్థుల సంఖ్య: ఎంపీ బీబీ పాటిల్‌


ట్రిపుల్‌ఐటీలకు చట్టబద్ధమైన హోదాతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పరిశోధన చేసే విద్యార్థులను ఆకర్షించడానికి ఈ విద్యాలయాలకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుందని ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ట్రిపుల్‌ఐటీ సవరణ బిల్లు-2020పై చర్చలో ఆయన మాట్లాడుతూ సూరత్‌, భోపాల్‌, భాగల్పూర్‌, అగర్తలా, రాయచూర్‌లోని ట్రిపుల్‌ఐటీలకు చట్టబద్ధమైన హోదాను ఇవ్వడంతో అవి జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంస్థల జాబితాలోకి వెళతాయని చెప్పారు. ఈ బిల్లు ఐటీ పరిశ్రమకు గ్లోబల్‌ స్టాండర్డ్‌ మానవ వనరులను అందించడానికి అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.


logo
>>>>>>