గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:06:10

త్వరితగతిన రైల్వే పనులు

త్వరితగతిన రైల్వే పనులు
  • లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా డిమాండ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రా ష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరా రు. గురువారం లోక్‌సభలో రైల్వే పై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా విభజనచట్టంలోని హామీలు నెరవేరలేదన్నారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి అతీగతి లేదని ఆందోళన వ్యక్తంచేశారు.  రైల్వే నెట్‌వర్క్‌లు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణలో పెండింగ్‌ లో ఉన్న మహబూబ్‌నగర్‌ కొత్త రైల్వేలైనుతో పాటు, పటాన్‌చెరువు -సంగారెడ్డి, వికారాబాద్‌ -వాడి -కృష్ణా, పెద్దపల్లి భువనగిరి, భువనగిరి -శంకర్‌పల్లి, విష్ణుపురం -జాన్‌పహాడ్‌, మానకొండూరు -మక్కెడ్‌ -పరర్భణి, నిజామాబాద్‌ -మద్కేడ్‌, నిజామాబాద్‌ -నిర్మల్‌ -ఆదిలాబాద్‌, గద్వాల -మాచర్ల తదితర లైన్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. సింగరేణి బొగ్గు రవాణాకు ఉపయోగపడే భద్రాచలం - కొవ్వూరు రైల్వేలైన్‌ ఎన్నోఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేశారు. దీనికోసం సింగరేణి సంస్థ ఇప్పటికే  50శాతం నిధులను తన వాటాగా రైల్వేలకు చెల్లించిందని చెప్పారు. 


logo