మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 16:05:31

ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు మాతృవియోగం

ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు మాతృవియోగం

ఖమ్మం : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు మాతృమూర్తి వరలక్ష్మి(91) గురువారం మృతి చెందారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఎంపీ నామా నాగేశ్వర్‌రావును ఫోన్‌లో పరామర్శించారు. వరలక్ష్మి మృతిపట్ల సంతాపం తెలిపారు. సాయంత్రం ఆమె భౌతికకాయాన్ని ఖమ్మానికి తీసుకురానున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo