ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 01:17:19

కేసీఆర్‌ హయాంలో అతివలకు అవకాశాలు

కేసీఆర్‌ హయాంలో అతివలకు అవకాశాలు
  • ఎంపీ మాలోత్‌ కవిత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఎం హయాం లో మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు అందుతున్నాయని ఎంపీ మాలోత్‌ కవి త పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం నిర్వహించి కేక్‌ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మహిళల కోసం అనేక సంక్షేమపథకాలను ప్రవేశపెట్టారన్నారు. అనంతరం ఇటీవల ఎన్నికైన మహిళా జెడ్పీ చైర్‌పర్సన్లు దీపిక, సరిత, అనితారెడ్డి, విజయ, కేం ద్రకార్మిక మండలి సభ్యురాలు రాజ్యలక్ష్మి తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో మా జీ జెడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎంపీ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


logo