శనివారం 11 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 20:58:46

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌: గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. సంతోష్‌కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థికసాయంతోపాటు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తాననడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. సీఎం కేసీఆర్ 19 మంది సైనికుల కుటుంబాలకూ ఆర్థికసాయం ప్రకటించడం అభినందనీయమన్నారు.

సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సంతోష్‌బాబు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇంటిస్థలం, ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. logo