కొండా కోనల మధ్య ఎగిసిపడే నీటి పరవళ్లు.. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నది. బోథ్ మండలంలో ఉన్న జలపాతం హైదరాబాద్కు 256 కిలోమీటర్ల దూరంలో ఉంది.