బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:26:00

మండలి గ్యాలరీలో ఎంపీ కే కేశవరావు

మండలి గ్యాలరీలో ఎంపీ కే కేశవరావు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు శనివారం శాసనమండలికి వచ్చారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సభ్యుల అభిప్రాయాలపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇస్తున్నప్పుడు కుమారుడు విప్లవ్‌తో వచ్చిన కేకే మండలి గ్యాలరీలో కూర్చొని సమావేశాలను తిలకించారు. శాసనమండలి సభ్యుడిగా గత అనుభవాలను సభ్యులతో పంచుకున్నారు. సాయంత్రం 4.55 గంటలకు మండలి గ్యాలరీకి వచ్చిన కేకే, సభ ముగిసేవరకు అక్కడే ఉన్నారు.


logo