శనివారం 06 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:31:46

మాస్కుతోనే మనుగడ!

మాస్కుతోనే మనుగడ!

  • లీఫ్‌ ఆర్ట్స్‌ ఫొటో ట్విట్టర్‌లో పెట్టిన ఎంపీ సంతోష్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మానవాళిని గుప్పిటపట్టి చిదిమేస్తున్న విశ్వమారి కరోనా కట్టడికి లీఫ్‌ ఆర్టిస్ట్‌ వినూత్న ప్రచారం చేపట్టారు. టేకు ఆకుపై వైరస్‌ నియంత్రణకు మాస్కు తప్పనిసరిగా వాడాలనే సందేశమిచ్చారు. టేకుఆకుపై తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌, సీం కేసీఆర్‌ చిత్రం, మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కు ధరించాలనే చిత్రంతోపాటు నినాదాన్ని జతచేశారు. లీఫ్‌ ఆర్టిస్ట్‌ వినూత్న కళానైపుణ్యాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ మెచ్చుకున్నారు. అత్యంత ఆకర్షణీయంగా చిత్రించిన లీఫ్‌ఆర్ట్‌ ఫొటోతోపాటు వీడియో చిత్రాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్టుచేశారు. logo