ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:31

పేటియంనూ నిషేధించండి

పేటియంనూ నిషేధించండి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చైనా పెట్టుబడులు ఉన్న సంస్థలపైనా నిషేధం విధించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాలెట్‌ సేవల సంస్థ పేటియం, క్యాబ్‌ సేవల సంస్థ ఓలా, ఈ-కామర్స్‌ సంస్థలు బిగ్‌ బాస్కెట్‌, పేటీఎం మాల్‌, బైజూ, క్వికర్‌, స్నాప్‌డీల్‌ వంటి అనేక సంస్థల్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. పేటియంను నిషేధించి ప్రధాని మోదీ తన 56 ఇంచుల ఛాతీలోని ధైర్యాన్ని ప్రదర్శించాలని తమిళనాడుకు చెందిన ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ సవాల్‌ విసిరారు. మరోవైపు సోషల్‌ మీడియాలో ‘బ్యాన్‌ పేటియం, బ్యాన్‌ చైనా కంపెనీస్‌' వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి. యాప్‌ల నిషేధంపై పేటియం వ్యవస్థాపకుడు విజయ్‌ శంకర్‌ శర్మ స్పందిస్తూ.. ‘కేంద్రం నిర్ణయం గొప్పది. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు పడుతాయి’ అని పేర్కొన్నారు. logo