శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 15:17:49

రూ.1.1 కోట్ల సాయం ప్రకటించిన ఎంపీ బీబీ పాటిల్‌

రూ.1.1 కోట్ల సాయం ప్రకటించిన ఎంపీ బీబీ పాటిల్‌

హైదరాబాద్‌ : కరోనా నివారణ కోసం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ. 1.1 కోట్లు కేటాయిస్తూ ఆయన ప్రకటన చేశారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జిల్లాలకు ఈ ఆర్థిక సాయం వర్తించనుంది. సంగారెడ్డి జిల్లాకు రూ. 50 లక్షలు, కామారెడ్డి జిల్లాకు రూ. 51 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఎంపీ ప్రకటించారు. తన ఎంపీ నిధుల నుంచి ఖర్చు చేయాలని ఈ మేరకు సంగారెడ్డి, కామారెడ్డి కలెక్టర్లకు బీబీ పాటిల్‌ లేఖ రాశారు.  కరోనా సహాయ చర్యలకు కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వరరావు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. 

 అదేవిధంగా ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం లాండ సాంగ్వి గ్రామానికి చెందిన రైతు మోర హన్మాండ్లు కరోనా నివారణ సహాయార్థం రూ. 50 వేల చెక్కును జిల్లా కలెక్టర్‌ ఏ.శ్రీదేవసేనకు అందజేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కరోనా నివారణ చర్యలకు, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సామాన్యులు మొదలుకొని పలు సంఘాలు, వివిధ రంగాల ప్రముఖులు తమవంతు సాయాన్ని అందజేస్తున్నారు.logo