శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 18:53:34

ఎంజీఎంకు ఎంపీ బండ ప్ర‌కాశ్‌ రూ. 14.50 ల‌క్ష‌లు అంద‌జేత‌

ఎంజీఎంకు ఎంపీ బండ ప్ర‌కాశ్‌ రూ. 14.50 ల‌క్ష‌లు అంద‌జేత‌

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ వరంగల్ లోని ఎంజిఎం ఆస్ప‌త్రికి ఎంపీ నిధుల నుంచి రూ. 14.50 ల‌క్ష‌లు అంద‌జేశారు. ఆసుపత్రిలో కోవిడ్ -19 వార్డుల్లో అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి రూ .14,50,700ను ఎంపీ కేటాయించారు. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమ్మతి తెలుపుతూ లేఖ ఇచ్చారు. ఈ నిధులను ఉపయోగించి 20 బీపాప్ (బై లెవ‌ల్‌ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) యంత్రాలు, ఒక మొబైల్ ఎక్స్‌రే యంత్రం, 10 ఎలక్ట్రిక్ సక్షన్ యంత్రాలను కొనుగోలు చేయాల్సిందిగా సూచించారు. 

ఆసుపత్రిని సందర్శించే రోగులు సమస్యలను ఎదుర్కొంటున్నందున తాను ఈ నిధులు కేటాయిస్తున్నానని బండా ప్రకాష్ తెలిపారు. ప్రజలకు సహాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాన‌ని చెప్పారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించ‌డం వంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పౌరులను ఈ స‌ద‌ర్భంగా తాను కోరుతున్న‌ట్లు ఎంపీ పేర్కొన్నారు. 


logo