బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల

హైదరాబాద్ : పీఏపల్లి మండలం అంగడిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ బడుగుల లింగయ్య భరోసా ఇచ్చారు. దేవరకొండ మండలం చింతబావిలో బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి ఎంపీ బడుగుల లింగయ్య పరామర్శించారు. ఘటన చాలా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వారంతా నిరుపేదలేనని వారి కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని అన్నారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ. 3 లక్షలు అందిస్తుందని, డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మరింత న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు ఎంపీ భరోసా ఇచ్చారు. అంతకుముందు ఆయన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాబా సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్ధనల అనంతరం గంధం ఊరేగింపులో పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు