సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 17:29:43

ఏఐఎంఐఎం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసులు ప్రారంభం

ఏఐఎంఐఎం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసులు ప్రారంభం

హైద‌రాబాద్ : ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నేడు ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను ప్రారంభించారు. రెండు అంబులెన్స్ స‌ర్వీసుల‌ను నేడు ఆయ‌న జెండా ఊపి ప్రారంభించారు. 24 గంట‌ల పాటు అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్‌లు న‌గ‌రంలో రోగుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించ‌నున్నాయి. ఒక్కో అంబులెన్స్‌ను  రూ. 8 ల‌క్ష్య‌ల వ్య‌యంతో ఏర్పాటు చేశారు. ఇంద‌నం,

ఉచిత పీపీఈ కిట్స్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను అంబులెన్స్‌లో ఏర్పాటు చేశారు. ‌మజ్లిస్ ఛారిటీ ఎడ్యుకేషనల్ రిలీఫ్ ట్రస్ట్ త‌ర‌పున ఈ అంబులెన్స్ సేవ‌ల‌ను ప్రారంభించారు. ‌మజ్లిస్ ఛారిటీ ఎడ్యుకేషనల్ రిలీఫ్ ట్రస్ట్ ఇప్ప‌టికే రూ. 19.70 ల‌క్ష‌ల విలువైన ట‌చ్ ఫ్రీ హ్యాండ్ శానిటైజ‌ర్‌ను న‌గ‌రంలోని వివిధ ప్రార్థ‌నా మందిరాల‌కు అందించింది. రూ. 15 ల‌క్ష‌ల విలువైన 2,818 పీపీఈ కిట్స్‌ను ఆశా, అంగ‌న్‌వాడీ, పోల‌స్ సిబ్బందికి అంద‌జేసింది. logo