బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 13:41:46

ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి కరోనా టెస్ట్‌

ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి కరోనా టెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాతబస్తీలోని యునానీ దవాఖానలో ఎంఐఎం అధ్యక్షుడు ఈ పరీక్షలు చేయించుకున్నారు. పాత నగరంలో కరోనా పరీక్షల తీరుతెన్నులను తెలుసుకోవడానికి ఎంపీ ఈ రోజు యునానీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్‌ టెస్టులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికే తాను పరీక్ష చేయించుకున్నట్లు ఎంపీ వెల్లడించారు. కరోనా ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చినట్లు ట్వీట్టర్‌లో తెలిపారు.


logo