మంగళవారం 26 మే 2020
Telangana - May 02, 2020 , 15:23:59

రంగనాయక సాగర్‌ కాల్వలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే

రంగనాయక సాగర్‌ కాల్వలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే

సిద్దిపేట : రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్‌ రావు నేడు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాల్వలకు నీటిని విడుదల చేసిన ఆనంద క్షణాల్లో గోదారమ్మ సవ్వడులను విని మైమరచిన ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ గోదావరి జలాల్లో మునిగితేలారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు చిన్న పిల్లల్లా, చేపపిల్లల్లా మారి కాల్వలో కాసేపు సరదాగా ఈదారు. హరీశ్‌ రావు సైతం సంబురంతో కాల్వ నీటిని ఇతరులపై చల్లుతూ ఆనందపరవశుడయ్యారు. ఈ సందర్భంగా చిన్న కోడూరు, నారాయణరావుపేట మండల ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు, స్థానికులు మంత్రి హరీశ్‌రావుతో సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.

logo