కదిలివచ్చి.. మద్దతిచ్చి

- టీఆర్ఎస్ వెంటే అన్నివర్గాలు
- కారుకే ఓటేస్తామని తీర్మానాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: ప్రగతిబాటలు వేస్తున్న టీఆర్ఎస్కు విశేష ఆదరణ లభిస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నివర్గాల మద్దతు వెల్లువెత్తుతున్నది. కుల, ఉద్యోగ, కార్మిక సంఘాలు గులాబీ పార్టీ వెంటే ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాజాగా, గురువారం తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక, ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్, ఇతర సంఘాలు మద్దతు తెలిపాయి.
తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక అండ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక మద్దతు తెలిపింది. గన్‌పార్కులో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు అందరం కలిసి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కృషిచేస్తామని వేదిక అధ్యక్షుడు జర్పుల నరేశ్‌నాయక్ చెప్పారు. అమరుల కుటుంబాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాడుకుంటే.. సీఎం కేసీఆర్ మాత్రమే ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. సమావేశంలో వేదిక ఉపాధ్యక్షులు నాగరాజు, సోమన్న, అనిల్, రాజు, చారి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
‘కారు’ వెంటే ట్యాక్సీ డ్రైవర్ల సంఘం
గ్రేటర్ ఎన్నికల్లో ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. మద్దతు తీర్మానాన్ని అసోసియేషన్ ప్రతినిధులు.. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అందజేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ట్యాక్సీ ప్రయాణికులకు వివరించాలని మర్రి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ అధ్యక్షుడు నగేశ్‌కుమార్, ఇతర ప్రతినిధులు రాజుగౌడ్, సత్యనారాయణ, కొప్పుల శేఖర్, వినాయక్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు