శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 00:53:37

పేగుబంధం నడిపించింది..

పేగుబంధం నడిపించింది..

  • లాక్‌డౌన్‌తో ఏపీలో చిక్కుకుపోయిన కొడుకు
  • 1,500 కి.మీ. స్కూటీపై వెళ్లి తీసుకొచ్చిన తల్లి 

శక్కర్‌నగర్‌(బోధన్‌): కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కన్నపేగు బంధాన్ని ఆపలేకపోయింది. సుమారు 1,500 కి.మీ. స్కూటీపై ప్రయాణించి కొడుకును క్షేమంగా ఇంటికి తెచ్చుకున్నది ఓ తల్లి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన రజియాబేగం బోధన్‌ మండలం సాలంపాడ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె కుమారుడు నజీముద్దీన్‌ గతనెల ఏపీలోని నెల్లూరు జిల్లా రహ్మతాబాద్‌కు వెళ్ల్లాడు. అక్కడికి చేరుకున్న అనంతరం లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డి అనుమతి పత్రం రాసివ్వడంతో ఈనెల 6న ఉదయం 8 గంటలకు బోధన్‌నుంచి బయలుదేరిన ఆమె 7వ తేదీ మధ్యా హ్నం రహ్మతాబాద్‌కు చేరుకున్నారు. ఆ వెంటనే కుమారుడిని తీసుకొని తిరుగు ప్రయాణమై 8వ తేదీ రాత్రి బోధన్‌కు చేరుకున్నారు. అవిశ్రాంతంగా ప్రయాణించిన ఆమె ధైర్యాన్ని స్థానికులు ప్రశంసించారు.


logo