ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:06:40

తాళ్లతో కట్టి.. కర్రతో కొట్టి

తాళ్లతో కట్టి.. కర్రతో కొట్టి

  • అల్లుడిపై అత్తింటివారిఅఘాయిత్యం
  • మూడు రోజుల తర్వాత వెలుగులోకి

పోచమ్మమైదాన్‌ (వరంగల్‌): భార్యభర్తల తగాదా తీవ్రమై అత్తింటివారు  అల్లుడిని తాళ్లతో బంధించి దాడి చేసిన ఘటన వరంగల్‌ నగరంలోఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   బాధితుడి వివరాల ప్రకారం.. కొత్తవాడకు చెందిన యెలుగం సుధాకర్‌కు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన అధినేత్రితో పదేండ్ల క్రితం వివాహమైం ది. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం సుధాకర్‌ ఇంట్లో ఉన్న సమయంలో మామ లక్ష్మణమూర్తి, అత్త వసంత, బావమర్దులు శివ, కేశవ, భార్య అధినేత్రి కలిసివచ్చారు. ఇంటికి తాళం వేసి, బయటి వారు రాకుండా ఏర్పాట్లు చేశారు. సుధాకర్‌ చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి కర్రలతో దాడి చేశారు. బాధితుడి మూలుగులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి తాళం పగులగొట్టే లోపే వారంతా పరారయ్యారు. స్థానికులు తాళ్లను విప్పి, ఎంజీఎం దవాఖానకు తరలించారు. బాధితుడి తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  


logo