మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 07:02:20

కూతురు మాట వినడం లేదని..

కూతురు మాట వినడం లేదని..

హైదరాబాద్ : కూతురు తన మాట వినకపోవడంతో తల్లిఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన నగరంలోని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రేమ్‌కుమార్‌ కథనం ప్రకారం దోమలగూడ బండానగర్‌లో వెంకటరమణ, భాగ్య (35) దంపతులు నివసిస్తున్నారు. వీరికి  కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఆదివారం రాత్రి మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని కూతురు నందినికి తల్లి భాగ్య చెప్పింది. దీంతో కూతురు మాట వినకపోవడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన భాగ్య వంట గదిలో నుంచి కిరోసిన్‌ తీసుకుని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు.బాధితురాలి పరిస్థితిని చెప్పలేమని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. logo
>>>>>>