బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 23:08:33

అనుమానాస్పదంగా తల్లీకుమార్తె మృతి

అనుమానాస్పదంగా తల్లీకుమార్తె మృతి

భూపాలపల్లి : తల్లీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా జవహర్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. కుమ్రం భీం జిల్లా గోలేటి గ్రామానికి చెందిన కుమార్‌కు జగిత్యాల జిల్లా చొప్పదండికి చెందిన లాస్యతో ఆరేండ్ల క్రితం వివాహమైంది. సింగరేణిలో పని చేస్తున్న కుమార్‌ ఇటీవల భూపాలపల్లికి బదిలీపై వచ్చాడు. ఉదయం విధులకు వెళ్లి తిరిగివచ్చే సరికి తన భార్య, కూతురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.