బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:56

చెరువులో దూకి చిన్నారిసహా తల్లి ఆత్మహత్య

చెరువులో దూకి చిన్నారిసహా తల్లి ఆత్మహత్య

మెదక్‌ కలెక్టరేట్‌: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన 17 నెలల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సోమవారం మెదక్‌ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌లోని కుమ్మరిబస్తీకి చెందిన చిలుకూరి రవి, అనూష దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రిత్విక(4) అమ్మమ్మ ఊరైన నిజాంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో ఉంటుంది. రవి, అనూష గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆమె చిన్న కూతురు ప్రణవి(17 నెలల)తో కలిసి ఈనెల 10న ఇంటి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు అనూష తల్లి శాంతవ్వ తన కూతురితోపాటు మనుమరాలు కనిపించడం లేదంటూ మెదక్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలావుండగా సోమవారం మెదక్‌ పట్టణంలోని పిట్లం చెరువులో తల్లీకూతుళ్లు శవాలై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. భర్త రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వెంకట్‌ తెలిపారు.


logo