బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 14:31:23

పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లీకొడుకు సజీవదహనం

పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లీకొడుకు సజీవదహనం

పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి  గ్యాస్ సిలిండర్ పేలి తల్లికొడుకు సజీవదహనం అయ్యారు. తల్లి యశోద, కొడుకు రాహుల్‌ రాత్రి వంట గదిలో పడుకున్నారు. కాగా అర్ధరాత్రి సమయంలో వంట గ్యాస్‌ లీక్‌ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.


logo