శనివారం 06 జూన్ 2020
Telangana - May 11, 2020 , 16:24:24

ఎక్కువ పని దినాలు కల్పించాలి : మంత్రి ఎర్రబెల్లి

ఎక్కువ పని దినాలు కల్పించాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : వీలయినంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలని, కొత్తగా వస్తున్న కూలీలకు జాబ్ కార్డులు జారీ చేయాలని, అధికారులను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  ఆదేశించారు.రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు, కూలీలకు ఉపాధి కల్పన, కరోనా, వేసవి నేపథ్యంలో కూలీల భద్రత, నర్సరీలు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, వైకుంఠ ధామాలు తదితర అంశాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ సగటున ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 182 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.  అలాగే పల్లె ప్రగతి, నర్సరీల్లో మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు వైకుంఠ ధామాల నిర్మాణ పనులను పురోగతిపై సమీక్షించారు. 


logo