గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 00:35:12

టీఆర్‌ఎస్‌కు వందకుపైగా సీట్లు

టీఆర్‌ఎస్‌కు వందకుపైగా సీట్లు

అభివృద్ధి కొనసాగాలంటే కారుకే ఓటేయండి

గాంధీనగర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

చిక్కడపల్లి: ఆరేండ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ రూపురేఖలు మార్చేసిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఆదివారం గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌తో కలిసి ఆమె ప్రచారంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందకుపైగా సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ నాయకులు వచ్చారంటే టీఆర్‌ఎస్‌ బలమేంతో ఆర్థం చేసుకోవాలని సూచించారు. 


logo