e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home తెలంగాణ తెలంగాణపై కుండపోత

తెలంగాణపై కుండపోత

తెలంగాణపై కుండపోత
  • హాజీపూర్‌లో రికార్డుస్థాయిలో 21 సెంటీమీటర్లు
  • 14 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం
  • నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు:
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ నెట్‌వర్క్‌: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కుండపోతగా కురిసింది. గడిచిన 24 గంటల్లో 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 21.38 సెంటీమీటర్లు వాన కురిసింది. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, నల్లగొండ, జగిత్యాల, ములుగు, వికారాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ మండలంలోని సౌత్‌ హస్తినాపురంలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్లు నమోదైంది.

నేడు అతిభారీ వర్షాలు

గురువారం పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

తెలంగాణపై కుండపోత
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణపై కుండపోత
తెలంగాణపై కుండపోత
తెలంగాణపై కుండపోత

ట్రెండింగ్‌

Advertisement