ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 00:49:20

విజయ డెయిరీ నుంచి మరిన్ని ఉత్పత్తులు

విజయ డెయిరీ నుంచి మరిన్ని ఉత్పత్తులు

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

హైదరాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న విజయ మెగా డెయిరీ నుంచి మరిన్ని ఉత్పత్తులు రావాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డెయిరీ నిర్మాణం కోసం పశుసంవర్ధకశాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డెయిరీకి 99 ఏండ్లు లీజుకు ఇచ్చారు. మంత్రి తలసాని, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర సమక్షంలో పశుసంవర్ధశాఖ డైరెక్టర్‌, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మెగా డెయిరీ నమూనాను సిద్ధంచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డైరెక్టర్‌ రాంచందర్‌ పాల్గొన్నారు.logo