సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 12:59:38

న‌గ‌రం న‌డిబొడ్డున అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపం

న‌గ‌రం న‌డిబొడ్డున అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపం

హైద‌రాబాద్ : న‌గ‌రం న‌డిబొడ్డున తెలంగాణ అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపాన్ని నిర్మిస్తున్న‌ట్లు రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. లుంబినీ పార్కు వ‌ద్ద కొన‌సాగుతున్న తెలంగాణ అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపం నిర్మాణ ప‌నుల‌ను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపం నిర్మించాల‌ని సీఎం కేసీఆర్ త‌ల‌పెట్టారు. దీంతో న‌గ‌రం న‌డిబొడ్డున 28 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపాన్ని నిర్మిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

రాష్ర్ట‌ప‌తి, ప్ర‌ధాని, కేంద్ర కేబినెట్‌తో పాటు ఇత‌ర దేశాల ప్ర‌ముఖులు రాష్‌ర్టానికి లేదా హైద‌రాబాద్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఈ అమ‌ర‌వీరుల స్మార‌కం వ‌ద్ద శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించేలా ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. విదేశాల ప్ర‌ముఖులు ఢిల్లీకి వ‌చ్చిన‌ప్పుడు.. అక్క‌డున్న స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల స‌మాధుల‌కు ఎలాగైతే నివాళుల‌ర్పిస్తారో.. అదే సంప్ర‌దాయాన్ని ఇక్క‌డ కూడా కొన‌సాగించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. స్మార‌కంలో ఆర్ట్ గ్యాల‌రీ, వీడియో గ్యాల‌రీతో పాటు లైబ్ర‌రీని ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ నిర్మాణ ప‌నులు రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయ‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.


logo